ర‌వితేజ‌, గోపిచంద్ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం

Sun,May 26, 2019 12:29 PM
Ravi Teja to collaborate with Gopi chand again

మాస్ మ‌హారాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాలు వ‌రుస‌గా చేశాడు. ఇందులో రాజా ది గ్రేట్ చిత్రం మాత్ర‌మే మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మే 27 నుంచి హైదరాబాద్‌లో జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో హీరో రవితేజతో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటార‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో RX 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ త‌ర్వాత రవితేజ మ‌రోసారి గోపి చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడట‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో డాన్ శీను, బ‌లుపు అనే చిత్రాలు వ‌చ్చాయి. సెప్టెంబరు నెలలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మరో సినిమా రూపొంద‌నున్న‌ట్టు దర్శకుడు గోపీచంద్‌ తిరుమలలో తెలిపారు.

3297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles