ఎన్నికల్లో సత్తాచాటిన సినీ ప్రముఖులు

Thu,May 23, 2019 05:20 PM
Ravikishan, sunneydeol wins in loksabha elections


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ ప్రముఖులు విజయకేతనం ఎగరేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం ప్రముఖ సినీ నటుడు రవికిషన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. రవికిషన్ తన ప్రత్యర్థి రాంభుయాల్‌పై 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నటి సుమలత అంబరీష్ తన ప్రత్యర్థి నిఖిల్ కుమారస్వామిపై విజయకేతనం ఎగురవేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమమాలిని గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ పాఠక్‌పై హేమమాలిని విజయం సాధించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, నటుడు సన్నీడియోల్ గెలుపొందారు.

4060
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles