నోట్లు కనిపించే సీన్స్ ని రీ షూట్ చేస్తున్న నిర్మాతలు

Wed,November 30, 2016 07:10 AM

అదివరకు ఏదైనా విపరీతం జరిగితే అంతా కాలమహిమ అని, విధి వైపరీత్యం అని అనేవాళ్లు. ఇప్పుడు నోట్ల మహిమ అంటున్నారు. నిజమే. టాలీవుడ్ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంతా అంతా కాదు. కోట్లాది రూపాయల వ్యాపారాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రొడ్యూసర్లు పేమెంట్స్ కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.


నోట్ల రద్దుతో జనాల దగ్గర డబ్బులు లేక సినిమాలు చూడ్డం మానుకుంటున్నారు. రిలీజైన సినిమాల పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. రిలీజ్ కావలసిన ఉన్న సినిమాల విడుదల డైలమాలో పడింది. ఇదంతా ఒక ఎత్తైతే … ఇప్పటికే షూటింగ్ చేసిన సినిమాల్లో కొన్ని సీన్స్ లో మార్పులు చేస్తున్నారట.

రిలీజ్ కావలసిన కొన్ని సినిమాల్లో నోట్లు కనబడే సీన్లు కొన్ని ఉన్నాయట. రద్దయిన నోట్లు కనిపించే సీన్లన్నమాట. ఇప్పుడు అదే ప్రాబ్లెమ్ గా మారింది. రద్దయిన నోట్లు చూపిస్తే తమ పిక్చర్ ను ఎవరూ చూడరని కొందరు నిర్మాతలు అనుకుంటున్నారు. కొన్ని సినిమాల్లో డబ్బు ఇచ్చుకోవడం .. పుచ్చుకోవడం .. పెద్దమొత్తంలో నోట్ల కట్టలు చూపించే సీన్స్ ఉంటాయి. అలాంటి సన్నివేశాలను షూట్ చేసిన తరువాత పాత నోట్లు రద్దయ్యాయి.

నోట్లు రద్దయిన తర్వాత ఇప్పుడు ఆ సీన్స్ లో పాత నోట్లు కనిపిస్తే జనం నవ్వుకుంటారు. కనుక ఎడిటింగ్ లో తీసేయడం లేదా వీలైతే గ్రాఫిక్స్ చేయించడం . మరీ తప్పదనుకుంటే ఒకటి రెండు సీన్స్ ని మళ్లీ షూట్ చేసి పెట్టుకోవడం చేస్తున్నారట. ఇలాంటి విచిత్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్న సినిమాల్లో లక్కున్నోడు.. మీలో ఎవరు కోటీశ్వరుడు ..కిట్టుగాడు వున్నాడు జాగ్రత్త వంటి సినిమాలు ఉన్నాయని అనుకుంటున్నారు.

1696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles