రెజీనాకి ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందంటూ ప్ర‌చారం

Wed,June 19, 2019 10:24 AM
Regina Cassandra engagement with co artist

కెరియ‌ర్ మొద‌ట్లో ఓ ఊపు ఊపిన రెజీనా ప్ర‌స్తుతం డీలా ప‌డింది. అ చిత్రం త‌ర్వాత తెలుగులో స్పీడ్ త‌గ్గించిన‌ రెజీనా ఇటీవ‌ల పీవీపీ సంస్థ నిర్మించిన ‘ఎవరు’లో న‌టించింది. ఈ చిత్రం ఆగ‌స్ట్‌లో రిలీజ్ కానుంది. నూతన దర్శకుడు అర్జున్‌ సాయి తెరకెక్కిస్తున్న ‘ఉత్సవం’లో నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక‌ తమిళంలో ‘కసడ తపర’ , ‘పార్టీ’, అరవింద్‌ స్వామితో ‘కల్లాపార్ట్‌’ అనే సినిమాలు చేస్తుంది. ఇప్పుడిప్పుడే కెరియ‌ర్ మ‌ళ్ళీ పుంజుకుంటుంద‌నుకున్న స‌మయంలో రెజీనా త‌న మాజీ ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకుంద‌ని ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నెల 13న రెజీనా సీక్రెట్‌గా నిశ్చితార్ధం జ‌రుపుకుంద‌ని, త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతుంద‌ని ఓ త‌మిళ ప‌త్రిక రాసుకొచ్చింది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే రెజీనా స్పందించాల్సిందే.

గ‌తంలో కూడా రెజీనా తన కోస్టార్ తో డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేసింది రెజీనా. నేను నా కోస్టార్ తో డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. డేటింగ్ పై వస్తున్న పుకార్లు నిరాధారమైనవి. ప్రస్తుతం నా జీవితంలో నేను ప్రేమిస్తుంది నా పనిని మాత్రమే. ఒకవేళ ఎవరితో ప్రేమ వ్యవహారం లాంటిదేమైనా ఉంటే అది నా నుంచే వింటారు. నన్ను ఎల్లపుడూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రోత్సహంతో నా పని సులభంగా కొనసాగుతుందని తెలిపింది రెజీనా.

1275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles