ఛాన్స్ వ‌స్తే బిగ్ బాస్‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తా : రేణూ

Thu,June 13, 2019 12:45 PM
renu intrested to host bigg boss

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు సీజ‌న్స్ పూర్తి చేస‌కున్న ఈ కార్య‌క్ర‌మం జూలై నుండి మ‌రో సీజ‌న్ జరుపుకోనుంది. ఈ సీజ‌న్‌కి నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని ప్ర‌చారం జ‌ర‌గుతుంది. ఇక కంటెస్టెంట్స్‌గా రేణూ దేశాయ్, సావిత్రి, ఉద‌య భాను , కేఏ పాల్ వంటి సెల‌బ్రిటీలు ఉంటారని ఓ టాక్ న‌డుస్తుంది. ఈ నేప‌థ్యంలో రేణూ దేశాయ్ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను బిగ్ బాస్‌లో పాల్గొన‌డం లేద‌ని చెబుతూ, ఛాన్స్ వ‌స్తే మాత్రం ఆ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తానంటుంది.

బిగ్ బాస్ షో విషయంలో తనకు చాలా మంది నుంచి సందేశాలు, ఫోన్లు వచ్చాయ‌న్నారు రేణూ. వారందరికీ నేను ఒకటే చెబుతున్నాను. బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం లేదు. అదంతా తప్పుడు ప్రచారమే అని స్పష్టం చేశారు. ఇటీవ‌ల త‌న రెండో పెళ్ళికి సంబంధించి వార్త‌ల‌లో నిలిచిన రేణూ ప్ర‌స్తుతం త‌న త‌ర్వాతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌తో బిజీగా ఉంది. అయితే బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తే త‌న లో నైపుణ్యం మ‌రింత పెరుగుతుంద‌ని, అందుకే ఛాన్స్ వ‌స్తే బిగ్ బాస్ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేస్తాన‌ని పేర్కొంది రేణూ. తెలుగులో ఓ టీవీ షోకి రేణూ జడ్జిగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే

3372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles