సుధీర్‌తో పెళ్లి విష‌యంలో నెటిజ‌న్‌కి కౌంట‌ర్ ఇచ్చిన ర‌ష్మి

Fri,June 22, 2018 08:02 AM
reshmi fire on netigen

డిజిట‌ల్ యుగంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం జ‌నాల‌లో ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మీడియాకి బాగా క‌నెక్ట్ అయ్యారు . కొంద‌రికి సోష‌ల్ మీడియా పోస్ట్‌ల‌తోనే రోజు మొద‌ల‌వుతుందంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఈ సోష‌ల్ మీడియా వ‌ల‌న సామాన్యుల‌కి, సెల‌బ్రిటీల‌కి మ‌ధ్య దూరం త‌గ్గింది. అభిమానులు వారి అనుమానాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా నివృత్తి చేసుకుంటున్నారు. తాజాగా ఓ నెటిజ‌న్ .. సుధీర్‌ని పెళ్లి చేసుకో ర‌ష్మీ .. మీరిద్దరు ఒకరి కోసం ఒక‌రు అన్నట్టుగా ఉంటారు . మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు'.. అని రష్మీకి ఉచిత సలహా ఇచ్చాడు.

నెటిజ‌న్ ట్వీట్‌కి రెస్పాండ్ అయిన ర‌ష్మీ.. మేము ఒక‌రి కోసం ఒకరం పుట్టామ‌ని మీరెలా చెప్ప‌గ‌ల‌రు ?.. స్క్రీన్‌పైన న‌టిస్తుండ‌గా మాత్ర‌మే మీరు చేశారు. రీల్ లైఫ్‌ని, రియ‌ల్ లైఫ్‌ల‌ని వేరు వేరుగా చూడ‌టం నేర్చుకోండి. మేము స్క్రీన్‌పైన చేసేదంతా ప్రేక్ష‌కుల‌ని ఆనంద‌ప‌ర‌చ‌డం కోస‌మే. మేము ఎవ‌రిని పెళ్లి చేసుకోవాల‌నేది మా ప‌ర్స‌న‌ల్ విష‌యం.దీంట్లో మీ స‌ల‌హాలు ఏమి అవ‌స‌రం లేదు అని కొంచెం ఘాటుగానే స‌మాధానం ఇచ్చింది ర‌ష్మీ. గ‌తంలోను వీరిద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని ప‌లు పుకార్లు షికారు చేయ‌గా ఆ స‌మ‌యంలోను వాటిని కొట్టి పారేసింది. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో పాటు ప‌లు టీవీ షోల‌కి వ్యాఖ్యాతగా ప‌ని చేస్తుంది ర‌ష్మీ. వెండితెర‌పై రాణించాల‌ని ప్ర‌య‌త్నించిన అది వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో బుల్లితెర‌పైనే అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది.

3724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles