న‌న్ను చంపినా.. నా సినిమా రిలీజ్ అవుతుంది

Sat,March 9, 2019 11:27 AM
RGV Declares That No One Can Stop The Release of my film

రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌నాల‌కి కేంద్ర బిందువుగా ఉంటార‌నే సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ప్ర‌స్తుతం ల‌క్ష్మీ పార్వతి దృష్టికోణం నుండి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంకి సంబంధించి విడుద‌లైన రెండు ట్రైల‌ర్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇక సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 22న చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తుండ‌గా, కొంద‌రు చిత్రాన్ని అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్జీవీ సినిమా రిలీజ్‌ని ఆపాలంటే ముందుగా నన్ను చంపండి. ఒక‌వేళ న‌న్ను చంపినా కూడా సినిమా రిలీజ్ ఆగ‌దు. ‘ఓ హార్డ్ డిస్క్ లో ర‌ష్ అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలని చీటీరాసి పెట్టాను. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవ్వరూ ఆపలేరు’ అని వర్మ ఓ ఇంట‌ర్వ్యూలో స్పష్టం చేశారు. ట్రైల‌ర్‌, పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఏయే అంశాలు చూపిస్తాడా అనే దానిపై హాట్ టాపిక్ న‌డుస్తుంది. తాజాగా చిత్రం నుండి సింహ‌గ‌ర్జ‌న అనే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది.సింహ‌గ‌ర్జ‌న వీడియో సాంగ్

5691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles