మేన‌కోడ‌లితో కండ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన వ‌ర్మ‌

Thu,March 7, 2019 08:35 AM

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో చేసే పోస్ట్‌లు నెటిజ‌న్స్‌కి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అయితే అందులో కొన్ని పోస్ట్‌లు కాంట్రవ‌ర్షియ‌ల్‌గా మారితే, మ‌రికొన్ని ఫ‌న్నీగా ఉంటాయి . తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా తన మేనకోడల్ని ప‌రిచ‌యం చేశారు. ఆమెతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా శ్రావ్య‌ వ‌ర్మ‌ది అద్భుత‌మైన టాలెంట్ అని కొనియాడారు. అంతే కాదు మేనకోడలుతో కలిసి కండల ప్రదర్శన చేస్తూ, ఈ కండల ప్రదర్శనలో పోటీపడి ఓడిపోయినట్టు సరదా ఫొటో షేర్ చేశారు వ‌ర్మ‌. ప్ర‌స్తుతం ఆయ‌న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.


తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలని పోస్ట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడని వర్మ అప్ప‌ట్లో తన కూతురి చిన్న నాటి ఫోటో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత తన తల్లి నిర్మలమ్మతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేశాడు. ఇక కూతురు రేవతి జిమ్ చేస్తున్న వీడియోని కూడా పోస్ట్ చేశాడు. ఇది చూసిన రేవతి తండ్రికి వార్నింగ్ ఇచ్చింది. నేను నీకు పర్సనల్ గా పంపిన వీడియోను నువ్వు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావు , వెంటనే డిలీట్ చేయి లేదంటే, అమెరికా నుండి వచ్చి నిజంగానే కొడతానని మెసేజ్ ఇచ్చింది. దీన్ని కూడా వర్మ నా కూతురు నాకు పెట్టిన మెసేజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు నా కూతురు నుండి రక్షించుకునేందుకు కాలేజ్ డేస్ లో నేను చేసిన బ్రూస్‌లీ స్టంట్స్ గుర్తు చేసుకుంటున్నాను అని పాత‌కాలం నాటి ఫోటో షేర్ చేశాడు వ‌ర్మ‌.

4086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles