ఈ అమ్మాయి చాలా చెడ్డ స్వ‌భావం క‌ల‌ది : వ‌ర్మ‌

Sun,February 24, 2019 07:59 AM
rgv tiktok video goes viral

ప్ర‌స్తుతం చిన్న,పెద్దా అనే తేడా లేకుండా అంద‌రు సోష‌ల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. దైనందిన జీవితంలో స‌గం స‌మయాన్ని దానికే కేటాయిస్తున్నారు. అయితే డ‌బ్ స్మాష్ మాదిరిగా ఈ మ‌ధ్య వ‌చ్చిన టిక్ టాక్‌కి యువ‌త బాగా క‌నెక్ట్ అయ్యారు. పాపుల‌ర్ వీడియోస్‌ని ఎంపిక చేసుకొని వాటికి వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పిన మాట‌ల‌కి ఓ అమ్మాయి టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో వ‌ర్మ కంట‌ప‌డ‌డంతో వెంట‌నే షేర్ చేసి ‘ఈ అమ్మాయి కూడా చాలా చెడ్డ స్వభావం కలది.. ఎందుకంటే మహిళల్ని రసగుల్లాతో పోల్చింది’ అంటూ సెటైర్ వేశాడు.

ఏ విష‌యాన్నైన నిర్మొహ‌మాటంగా మాట్లాడే స్వ‌భావం వ‌ర్మ‌ది. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న‌ని ‘మీకు చాలా ఇష్టమైన పదం అమ్మాయి కరెక్టేనా? అని యాంకర్ స్వప్న అడిగితే.. ‘అమ్మాయి అనే మాట విన్నప్పుడు నాకు రసగుల్లా గుర్తుకు వస్తుంది. సో రసగుల్లా అంటే జనానికి ఎంత ఇష్టమో నాకు అమ్మాయి అంటే అంత ఇష్టం’.. అంటూ కాస్త ఘాటుగానే చెప్పేశాడు వర్మ. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే రేగింది. ఇప్పుడు అవే మాట‌ల‌తో ఓ అమ్మాయి టిక్ టాక్ చేయ‌డంతో వ‌ర్మ అలా స్పందించాడు. వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.6663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles