ఆ ఫోటోలో రోడ్ సైడ్ రోమియోలా ఉన్నాను: వ‌ర్మ‌

Sun,February 17, 2019 12:54 PM
rgv tweets on siva movie

తెలుగు సినిమా చరిత్రలో 'శివ' మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత హీరోగా నాగార్జున, దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. అప్పట్లో ఈ సినిమాకు సత్తి బాబు అనే వ్యక్తి ఎడిటర్‌గా పని చేశారు. ఆయ‌న ఎడిటింగ్ కూడా సినిమాకి చాలా ప్ల‌స్ అయింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా హిట్ కావడమే కాదు... హీరో నాగార్జున కెరీర్ లో శివ ఒక మైల్ స్టోన్‌గా నిలిచింది. ఆ తర్వాత నాగ్ ఎన్ని సినిమాలు చేసినా ... ఇప్పటికీ శివను మరచిపోలేనని చెబుతుంటాడు. అంతటి థ్రిల్ ఇచ్చిన శివ మూవీ గురించి ఆర్ జీవీ కొన్ని జ్ఞాపకాల్ని నెమరేసుకున్నాడు. శివ సినిమా షూటింగ్ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం ఇదే రోజు ( ఫిబ్రవరి 17,1989న) లాంచ్ అయిందని ఓ ఫోటో షేర్ చేశారు ఆర్జీవి. ఇందులో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కెమెరా స్విచ్ ఆన్ చేస్తుండ‌గా, వ‌ర్మ ప‌క్క‌నే ఉన్నారు. ఆ ఫోటోలో నేను రోడ్ సైడ్ రోమియోలా క‌నిపిస్తున్నాను అని ట్వీట్‌లో తెలిపారు వ‌ర్మ‌.

శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాల నేప‌థ్యంలో చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు.2586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles