రాజ్‌క‌పూర్ కుమార్తె మృతి.. బాలీవుడ్‌ సంతాపం

Tue,January 14, 2020 12:00 PM

అల‌నాటి మ‌హాన‌టుడు రాజ్‌క‌పూర్ కుమార్తె, శ్వేతా బ‌చ్చ‌న్ అత్త‌య్య రీతూ నంద‌(71) స్వ‌ర్గస్తుల‌య్యారు. కొన్నాళ్లుగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆమె ఈ రోజు తెల్ల‌వారుఝామున మృతి చెందారు. అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్‌బీర్ సోద‌రి రిద్దిమా క‌పూర్ ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా క‌న్‌ఫాం చేశారు. రీతూ .. ఎస్కార్ట్స్ గ్రూప్ ఛైర్మ‌న్ రాజ‌న్ నంద‌ని వివాహం చేసుకోగా ఆయ‌న 2018లో మ‌ర‌ణించారు. ఈమె లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తుండ‌గా, ఒక రోజులో 17000 పెన్ష‌న్ పాలసీలు చేయించిన రికార్డ్ సొంతం చేసుకున్నారు . రీతూ.. రిషి క‌పూర్, ర‌ణ్‌ధీర్ క‌పూర్‌, రాజీవ్ క‌పూర్‌ల‌కి సోద‌రి కాగా, రాజ్ క‌పూర్‌కి కుమార్తె. అత్యంత మృదుస్వ‌భావి అయిత‌న ఆమె మ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తుంది. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని రిద్ధిమా క‌పూర్ తెలిపారు .


3396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles