నాని స‌ర‌స‌న విజ‌య్ దేవ‌ర‌కొండ భామ‌ ..!

Sat,December 8, 2018 09:45 AM
Ritu Varma joins with vikram kumar project

హ్య‌ట్రిక్ విజ‌యాలు సాధించిన మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నేచుర‌ల్ స్టార్ నాని, క్రేజీ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్‌ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే . నాని 24వ చిత్రంగా రూపొంద‌తున్న ఈ చిత్రంకి పీసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేయ‌నుండ‌గా, ఫిబ్ర‌వ‌రి 19 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ప్రాజెక్ట్‌కి సంబంధించి నాని ఫోటో షూట్ కూడా పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. చిత్రంలో సిద్ధార్ద్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఇందులో క‌థానాయిక‌గా పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన రీతూ వ‌ర్మ న‌టించ‌నుంద‌ని అంటున్నారు. పెళ్ళి చూపులు త‌ర్వాత రీతూ కేశ‌వ అనే సినిమాలో న‌టించింది.ఈ మూవీ అంత‌గా హిట్ కాక‌పోయే స‌రికి రీతూకి ఛాన్స్‌లు కూడా క‌రువ‌య్యాయి. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌పై దృష్టి పెడుతున్న ఈ అమ్మ‌డికి అనుకోకుండా విక్ర‌మ్ కుమార్ సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌ని అంటున్నారు. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని టాక్.

2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles