అబ్బురపరుస్తున్న రాక్ ఆన్2 టీజర్

Wed,September 7, 2016 07:59 AM

రాక్‌ ఆన్‌ చిత్రానికి సీక్వెల్‌గా రాన్‌ ఆన్‌-2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రితేశ్ సిద్వాని,ఫర్హాన్‌ అక్తర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కిస్తున్నారు షుజాత్‌ సౌదాగర్‌. రాక్‌ ఆన్‌ చిత్రం బాలీవుడ్‌లో ఓ సంచలనం సృష్టించింది. వైవిధ్యమైన బ్యాక్ డ్రాప్‌ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. సీక్వెల్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోండగా తాజాగా రాక్ ఆన్‌ 2 మూవీ టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రద్ధాకపూర్‌, ప్రాచీదేశాయ్, అర్జున్‌ రాంపాల్‌, ఫర్హాన్‌ అక్తర్‌, పురబ్ కోహ్లి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ ఓ పాటను పాడనుందనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి తాజాగా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.


1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles