లండ‌న్‌లో బాహుబ‌లి టీం..

Sat,October 19, 2019 08:39 AM

చ‌రిత్ర సృష్టించిన బాహుబ‌లి సినిమా విడుద‌లై చాలా రోజులే అవుతున్నా, ఆ సినిమా వైబ్రేష‌న్స్ మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి . ఎన్నో రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకున్న బాహుబ‌లి చిత్రం తాజాగా మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కించుకుంది. బాహుబలి సినిమాను లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు . అదే వేదిక మీద సంగీత దర్శకుడు కీరవాణి బాహుబలి నేపథ్య సంగీతాన్ని లైవ్‌లో పర్‌ఫార్మ్ చేయ‌నున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాహుబలి చిత్రయూనిట్ అంతా లండన్ చేరుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు యూనిట్ అంతా అక్కడే ఉండేందుకు ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఇందుకోసం జ‌క్క‌న్న‌ ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు వారం రోజుల పాటు బ్రేక్ కూడా ఇచ్చార‌ని తెలుస్తుంది.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles