ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ లుక్‌కి జ‌క్క‌న్న టైం ఫిక్స్ చేశాడా..!

Fri,February 15, 2019 11:38 AM
rrr first look release on ram charan birthday

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో దుబాయ్‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి వార్త‌లు కాని, పోస్ట‌ర్స్ కాని బ‌య‌ట‌కి రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్న జ‌క్క‌న్న మూవీ ఫ‌స్ట్ లుక్‌ని రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే ( మార్చి 27) రోజున విడుద‌ల చేయ‌నున్నార‌ని అంటున్నారు. బాహుబ‌లి చిత్రం స‌మ‌యంలో కూడా రాజ‌మౌళి ఆర్టిస్టుల బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పోస్ట‌ర్స్ విడుద‌ల చేస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచిన సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తుంది. అలియా భ‌ట్ , ప‌రిణితి చోప్రా క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండగా , బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాలో చరణ్ బ్రిటీష్‌ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నాడ‌ని టాక్. 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది. కీరవాణి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

2453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles