ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రేర‌ణ ఏ చిత్ర‌మో తెలుసా ?

Fri,March 15, 2019 01:47 PM

టాలీవుడ్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రాల‌లో ఆర్ఆర్ఆర్ ఒక‌టి. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంకి సంబంధించిన ప‌లు విష‌యాల గురించి నిన్న‌టి ప్రెస్‌మీట్‌లో ప్ర‌స్తావించారు రాజమౌళి. అయితే ఈ చిత్రం అల్లూరి సీత‌రామ‌రాజు, కొమురం భీం క‌లిసి ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న‌ట్టు రాజ‌మౌళి చెప్పాడు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా, కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్జ‌ర్ జోన్స్‌ జోడి క‌ట్టింది. సముద్రఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు


మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ విలేక‌రి ఈ సినిమా ఆలోచ‌న ఎవ‌రిది అని రాజ‌మౌళిని ప్ర‌శ్నించ‌గా, ఆలోచ‌న త‌న‌దే అని చెప్పాడు. క‌థ మాత్రం త‌న తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ డెవ‌లెప్ చేస్తార‌ని అన్నారు. కొద్ది సంవ‌త్స‌రాల క్రితం 2004లో వ‌చ్చిన ‘మోటర్‌ సైకిల్‌ డైరీస్‌’ సినిమా చూశాను. ఇంట్ర‌స్టింగ్‌గా సాగుతున్న‌ సినిమాలో షే అనే వ్యక్తి గురించి కథ సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ ఉంటుంది. చాలా బాగుంది. రాజు అనే కుర్రాడి గురించి చెప్పి, అతనే తర్వాత బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడాడు అని చెబితే ఎలా ఉంటుంది? అనిపించింది. అలాగే అల్లూరి, కొమరం భీమ్‌ ఇద్దరు ఇంచుమించు ఒకే కాలానికి చెందినవారు కావడం, ఒకేసారి ఎక్కడికో వెళ్లిపోవడం, తిరిగొచ్చిన తర్వాత ఇద్దరు గెరిల్లా వార్‌లా ఫైట్‌ చేయడం... ఇది అద్భుతమైన ఆలోచన అనిపించింది. అలా ఈ సినిమా వచ్చిందని రాజ‌మౌళి స్ప‌ష్టం చేశాడు. స్పానిష్ భాష‌లో తెర‌కెక్కిన ‘మోటర్‌ సైకిల్‌ డైరీస్‌’ చిత్రాన్ని వాల్ట‌ర్ సల్లెస్ తెర‌కెక్కించాడు. ఈ చిత్రం 2005లో బీఎఎఫ్‌టీఏ అవార్డుతో పాటు ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు, త‌దిత‌ర అవార్డుల‌ని పొందింది.

2835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles