పూణేలో ఆర్ఆర్ఆర్ నాన్‌స్టాప్ షూటింగ్

Fri,March 22, 2019 08:51 AM

టాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మొన్న‌టి వ‌ర‌కు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో, అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో కొన్ని స‌న్నివేశాల‌పై చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. ఇప్పుడు పూణేలో భారీ షెడ్యూల్ జ‌రిపేందుకు చిత్ర బృందం సిద్ద‌మైంది. ఇప్ప‌టికే టీం అంతా షూటింగ్‌లో పాల్గొనేందుకు పూణే వెళ్ళ‌గా దాదాపు 47 రోజుల పాటు అక్క‌డ షూటింగ్ జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఈ షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్ , స‌ముద్ర‌ఖ‌ని కూడా పాల్గొంటార‌ని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత టీం మ‌ళ్ళీ హైద‌రాబాద్‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది.


ఆర్ఆర్ఆర్ చిత్రం అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం క‌లిసి ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో తెర‌కెక్కుతుంది. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా, కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్జ‌ర్ జోన్స్‌ జోడి క‌ట్టింది. జూలై 30,2020న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ అన్ని భాషల్లో ఉమ్మడి వర్కింగ్ టైటిల్‌గా ఉంటుందని, ఒక్కోభాషలో ఆర్‌ఆర్‌ఆర్ సంక్షిప్త నామానికి పూర్తి అర్థం స్ఫురించేలా టైటిల్‌ను ఎంపిక చేస్తామని చెప్పారు రాజ‌మౌళి. ఆ టైటిల్‌ను నిర్ణయించే బాధ్యత ప్రేక్షకులకే వదిలేయ‌గా, ప‌లు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌యి. వాటిలో జ‌క్కన్న ఏది ఫైన‌ల్ చేస్తాడో చూడాలి.

1669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles