కోకాపేట‌లో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌

Tue,April 30, 2019 11:55 AM
rrr movie shooting at kokapet

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌కి ఇటీవ‌ల‌ బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్ గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. దీంతో చిత్ర షూటింగ్‌ని 3 వారాల పాటు వాయిదా వేశారు. ప్ర‌స్తుతం చెర్రీ కొలుకున్నాడ‌ని తెలుస్తుండ‌గా, హైద‌రాబాద్ శివారు ప్రాంతంలోని కోకాపేట‌లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత చిత్ర బృందం మ‌రోసారి పూణేకి వెళ్ళ‌నుంది. అక్క‌డ పెండింగ్ షెడ్యూల్ పూర్తి చేయ‌నున్నారు. అనుకున్న టైంకి చిత్రీక‌ర‌ణ‌ని పూర్తి చేసి జూలై 30,2020న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజ‌మౌళి పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలియా భ‌ట్ .. చ‌ర‌ణ్‌కి జోడీగా న‌టించ‌నుంది.

1771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles