ఆర్ఆర్ఆర్ షెడ్యూల్‌ని త‌మిళ‌నాడుకి మార్చిన జ‌క్క‌న్న‌

Sun,July 28, 2019 10:02 AM

ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని చెక్కుతున్నాడు. ఎన్టీఆర్, రాజ‌మౌళి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఈ చిత్ర త‌దుప‌రి షెడ్యూల్ పూణేలో ప్లాన్ చేశారు. అక్క‌డ షూటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న‌ప్పుడ‌ల్లా ఏదో ఒక ఆటంకం ఏర్ప‌డుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో రాజ‌మౌళి పూణేలో జ‌ర‌పాల్సిన షెడ్యూల్‌ని త‌మిళ‌నాడుకి షిఫ్ట్ చేశాడ‌ట‌. ఇప్ప‌టికే అక్క‌డ ప‌లు లొకేష‌న్స్ ఓకే చేశాడ‌ని, దాదాపు 35 రోజుల పాటు అక్క‌డ షూటింగ్‌ జ‌రిపేందుకు స‌న్నాహాలు కూడా చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. చ‌ర‌ణ్ - ఎన్టీఆర్‌పై కీల‌క స‌న్నివేశాల‌ని ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రిస్తార‌ట‌. జూలై 30, 2020న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తుండ‌గా, ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న జ‌క్క‌న్న. బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ కథానాయిక‌గా న‌టిస్తుంది. స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గణ్ వంటి ప్ర‌ముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles