ఆ ఇద్ద‌రి స్నేహానికి ఫ్యాన్స్ ఫిదా

Sun,August 4, 2019 11:59 AM

ఆప‌ద‌లో స‌మయంలో అండ‌గా నిలిచేది స్నేహితుడు.. క‌ష్ట న‌ష్టాల‌లో వెన్నంటే నిలిచేది ఫ్రెండ్‌. ఈ రోజు ఫ్రెండ్‌షిప్ డే బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ స్నేహితుల‌కి స్నేహితుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో త‌మ ఫ్రెండ్షిప్‌ని మరింత బ‌ల‌ప‌రచుకున్న ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలుపుకున్నారు. జూనియ‌ర్ త‌న ట్విట్ట‌ర్‌లో రామ చ‌ర‌ణ్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. స్నేహం ఎంపిక‌కి కాస్త టైం ప‌ట్టొచ్చు. కానీ ఒక్క‌సారి స్నేహం చేస్తే వారితో స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది అని సోక్ర‌టిస్ చెప్పిన కోట్‌ని పోస్ట్ చేసి ఆర్‌ఆర్‌ఆర్‌ యే దోస్తీ(#RRRYehDosti) అనే హ్యాష్‌ ట్యాగ్ జ‌త చేశాడు .


కొన్ని బంధాలు ధృడ‌ప‌డ‌డానికి టైం ప‌డ‌తుంది. కాని ఒక్కసారి బ‌ల‌ప‌డితే జీవితాంతం స్ట్రాంగ్‌గా ఉంటుంది. నాకు అలాంటి బంధం తార‌క్‌తో ఏర్ప‌డింది అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ యే దోస్తీ(#RRRYehDosti) అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు రామ్ చ‌ర‌ణ్. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. వారాహి చలనచిత్రం అధినేత, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘విధి అనుకూలిస్తేనే సాయిగారిలాంటి వ్యక్తిని కలిస్తాం. చిన్నపిల్లాడి మనస్తత్వం, నమ్మకానికి రూపం, వెన్నంటి ఉండే బలం. ఆయన నా భీమ్‌. ఆయన ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు జ‌క్క‌న్న‌. ఫ్రెండ్షిప్ డే సంద‌ర్బంగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి పెట్టిన పోస్ట్‌లు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

2310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles