తెలుగు ద‌ర్శ‌కుల‌కి ఫ్రెంచ్ డైరెక్ట‌ర్ చుర‌క‌లు

Tue,September 3, 2019 12:47 PM

ఈ మ‌ధ్య కాలంలో మ‌న సినిమాలు వేరే భాష‌ల‌కి చెందిన సినిమాల‌కి కాపీ అని ప‌లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కొంద‌రు నెటిజ‌న్స్ సీన్ టూ సీన్‌కి సంబంధించిన ఫోటోలు , వీడియోలు షేర్ చేసి మ‌రీ కాపీ అని ఆరోపిస్తున్నారు. ఆ మ‌ధ్య ఫ్రెంచ్ చిత్రం 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సాలీ త‌న సినిమాని కాపీ చేసి అజ్ఞాత‌వాసి చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌లు ఆరోప‌ణ‌లు చేశాడు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న టాలీవుడ్ భారీ బ‌డ్జెట్ చిత్రం సాహోని త‌న సినిమాకి కాపీ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.


ఓ నెటిజ‌న్ జెరోమ్ సాలిని ట్యాగ్ చేస్తూ సాహో చిత్రం లార్గో వించ్‌కి ఫ్రీమేక్ అని , మీరు రియ‌ల్ గురూజీ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి కాస్త వ్యంగ్యంగా బదులిచ్చిన జెరోమ్ ..నాకు భారతదేశంలో మంచి కెరీర్ ఉందని నేను భావిస్తున్నాను అని అన్నాడు. అంత‌టితో ఆగ‌క.. లార్గో వించ్ యొక్క రెండవ ఫ్రీమేక్ మొదటిదాని క‌న్నా చెడ్డగా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి తెలుగు దర్శకులు, మీరు నా పనిని దొంగిలించినట్లయితే, కనీసం దీన్ని అయిన‌ సరిగ్గా చేయండి అని చుర‌క‌లు అంటించారు. లార్గోవించ్ కాపీ చేసి తెరకెక్కించిన రెండు సినిమాలకు నెగెటివ్ టాక్ రావటంతో కనీసం కాపీ అయినా సరిగా చేయండి అని జెరోమ్‌ వెటకారంగా ట్వీట్ చేశాడని నెటిజ‌న్స్ చ‌ర్చించుకుంటున్నారు.

లార్గోవించ్ అనే సినిమా అదే పేరు కలిగిన హాస్యప్రధాన నవల ఆధారంగా రూపొంద‌గా , ఒక కోటీశ్వరుడి రహస్య దత్తపుత్రుడు, తన తండ్రి హంతకులను కనుగొని శిక్షించడంకోసం అజ్ఞాతవాసం చేయడం ఈ సినిమా ఇతివృత్తం. అజ్ఞాత‌వాసి చిత్రం దాదాపు ఇదే సినిమాని పోలి ఉన్న‌ప్ప‌టికి, సాహో క‌థ‌నం కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది. కాక‌పోతే మూల కథ దాదాపు లార్గో వించ్‌ను పోలి ఉండటంతో నెటిజ‌న్స్ కూడా లార్గోవించ్‌కి కాపీ అని ఆరోపిస్తున్నారు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో సాహో చిత్రం తెర‌కెక్క‌గా ఈ చిత్రం 200 కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. రీసెంట్‌గా ఈ చిత్రంపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ లిసారే కాపీ రైట్ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. `బేబీ వోన్ట్ యు టెల్‌మీ..` అనే పాట‌లో ఆర్ట్ వ‌ర్క్‌ను `సాహో` యూనిట్.. షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వ‌ర్క్ నుండి కాపీ కొట్టార‌ని లిసా రే ఆరోపించింది


5143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles