ఆ ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు చిత్రంగా సాహో

Fri,August 23, 2019 11:24 AM
Saaho is the FIRST Telugu film got Twitter emoji

స‌రిగ్గా వారం రోజుల‌లో విడుద‌ల కానున్న అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుజీత్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సాహోకి చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింద‌ని తెలుస్తుంది. పాత రికార్డుల‌ని తిర‌గ‌రాసేందుకు సాహో టీం సిద్ధం కాగా, తాజాగా ఈ చిత్రం అరుదైన ఘ‌న‌త సాధించింది. ప్ర‌భాస్ గాగుల్స్ పెట్టుకొని ఉన్న లుక్‌ని ట్విట్ట‌ర్‌ ఇమోజీగా విడుద‌ల చేసింది సాహో చిత్ర బృందం. ఇంత వ‌ర‌కు ఏ తెలుగు సినిమాకి సంబంధించి ఇమోజీ విడుద‌ల కాక‌పోగా, ఆ ఘ‌నత సాధించిన తొలి తెలుగు చిత్రం సాహో కావ‌డం విశేషం. చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు.

3258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles