సాహో మేకింగ్ వీడియో

Tue,September 10, 2019 08:49 AM
Saaho Making video

ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుజీత్ తెర‌కెక్కించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సాహో. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళుతుంది. చిత్రానికి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి క‌లెక్ష‌న్స్ విష‌యంలో మాత్రం పాజిటివ్ బ‌జ్ క‌నిపిస్తుంది. అయితే చిత్ర‌యూనిట్ తాజాగా మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని ఏ విధంగా తెర‌కెక్కించారో చూపించారు. అంతే కాదు హాలీవుడ్‌కి సంబంధించిన ప‌లువురు యాక్ష‌న్ పార్ట్‌కి సంబంధించి ఎలా ప్లాన్ చేశారో కూడా వివ‌రించారు. ఈ వీడియో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. సాహో చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌గా, బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

1072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles