సాహో చిత్ర నిర్మాతల ఔదార్యం

Fri,August 30, 2019 07:21 AM
Saaho Producers financial help to Prabhas fan Venkatesh

అభిమాని వెంకటేశ్ ను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేత
సినీ నటుడు ప్రభాస్ సాహో సినిమా విడుదలకు సంబంధించి.. మహబూబ్ నగర్ లోని ఓ థియేటర్ వద్ద బ్యానర్ కడుతుండగా వెంకటేశ్ నాయక్ అనే యువకుడు విద్యుదాఘాతానికి గురైన విషయం తెలిసిందే. బాధిత యువకుడు సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. యువనేత మిథున్‌రెడ్డి, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు విక్రమ్ రెడ్డి, వంశీరెడ్డి.. వెంకటేశ్ ను పరామర్శించారు. గురువారం గాంధీ దవాఖానకు చేరుకుని ఆయన పరిస్థితిని బాధిత కుటుంబ సభ్యులను, దవాఖాన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేసి సాహో చిత్ర నిర్మాతలు తమ ఔదార్యం చాటుకున్నారు.

10943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles