చెన్నైలో రికార్డ్ క‌లెక్ష‌న్స్ సాధించిన సాహో

Sat,August 31, 2019 10:51 AM

దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సాహో. ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం శుక్ర‌వారం భారీ సంఖ్య‌లో విడుద‌లైంది. ఎన్నో అంచ‌నాల న‌డుమ ప‌లు భాష‌లలో రిలీజైన‌ ఈ చిత్రం అభిమానులని కూడా పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింద‌నే టాక్ న‌డుస్తుంది. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సాహోకి తిరుగులేద‌నిపిస్తుంది. చెన్నైలో ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 73 ల‌క్ష‌ల గ్రాస్( అన్ని వ‌ర్షెన్స్ క‌లుపుకొని) వ‌సూళ్ళు రాబ‌ట్టింద‌ని అంటున్నారు. త‌మిళ‌నాడులో 4 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు రాబ‌ట్టిన సాహో కేవ‌లం తెలుగు వ‌ర్షెన్‌కే 32ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూళ్ళు సాధించింది. గ‌తంలో మ‌హేష్ న‌టించిన భ‌ర‌త్ అనే నేను చిత్రం చెన్నైలో ఒక రోజుకి 27 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. గ‌త రికార్డుల‌ని తిర‌గరాసిన సాహో రానున్న రోజుల‌లో మ‌రిన్ని రికార్డులు చెరిపేస్తుంద‌ని అంటున్నారు. సాహో చిత్రం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రం మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందింది. ఇందులో ప‌లువురు బాలీవుడ్ స్టార్ ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించి సంద‌డి చేశారు.

3759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles