పాపుల‌ర్ టీవీ షోలో ప్ర‌భాస్ అండ్ టీం సంద‌డి

Thu,August 22, 2019 09:08 AM

టాప్ మోస్ట్ రేటింగ్ టీవీ ప్రొగ్రాం ‘ది కపిల్ శర్మ షో’ . ఈ షో ఎంత ఫేమ‌స్ అనేది మ‌నంద‌రికి తెలిసిందే. ఈ షోకి వ్యాఖ్యాత‌గా ప్ర‌ముఖ హిందీ క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఈ షోకి వచ్చి మ‌రీ త‌మ సినిమాని ప్ర‌మోట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ప్ర‌భాస్, శ్ర‌ద్దా క‌పూర్‌, నీల్ నితిన్ ముఖేష్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై తమ సినిమాకి సంబంధించిన విష‌యాలు షేర్ చేసుకున్నారు. క‌పిల్‌తో ప్ర‌భాస్ అండ్ టీం చేసిన సంద‌డి టీవీ ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌ని అంటున్నారు. సాహో చిత్రం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన విష‌యం విదిత‌మే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఆగస్టు 30న సాహో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్ర‌త్యేక గీతంలో ప్ర‌భాస్‌తో ఆడిపాడ‌నున్నారు.

1578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles