సాహో ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,August 10, 2019 01:53 PM
saaho trailer released

అభిమానులు ఎప్పుడా ఎన్న‌డా అంటూ ఎదురు చూస్తున్న సాహో ట్రైల‌ర్ వ‌చ్చేసింది. దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్ర‌భాస్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుద‌లైన సాహో ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ని భారీగా పెంచేసింది. క‌ళ్ళు చెదిరే యాక్ష‌న్ స‌న్నివేశాలు, ప్రభాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌ల రొమాన్స్‌తో పాటు నేప‌థ్య సంగీతం కూడా బాగుంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఈ చిత్రంతో మ‌రోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌బోతున్న‌ట్టు తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌ని చూస్తే తెలుస్తుంది. అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయ‌ని చిత్ర బృందం చెబుతుంది.

సాహో చిత్రాన్ని 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో స్పై థ్రిల్ల‌ర్‌గా సుజీత్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, లాల్‌ వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ చిత్రానికి పని చేయ‌గా , ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఏర్పాట్లు చేస్తుంది. సాహో చిత్రం యాక్ష‌న్ ఎంటర్టైన‌ర్‌గా రూపొందుతుండ‌గా, ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు. సాహో చిత్రానికి సంబంధించి చాప్ట‌ర్ 1, చాప్ట‌ర్ 2 పేరుతో విడుద‌లైన వీడియోల‌తో పాటు టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం విదిత‌మే.

1454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles