భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడితో మెగా హీరో..!

Thu,December 27, 2018 08:12 AM

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మంచి హిట్ కొట్టాల‌ని ఎంత‌గా కృషి చేస్తున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో తేజూకి స‌రైన హిట్ ద‌క్క‌లేదు. దీంతో త‌న తాజా చిత్రం చిత్ర‌ల‌హరిపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. నేను శైల‌జ ఫేం తిరుమ‌ల కిశోర్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఏప్రిల్‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ చిత్రం సెట్స్ పైన ఉండ‌గానే మ‌రో చిత్రానికి తేజూ పచ్చ జెండా ఊపాడ‌ని అంటున్నారు. భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడు అశోక్‌తో క‌లిసి సాయి ధ‌ర‌మ్ సినిమా చేస్తాడ‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్‌. ఈ చిత్రంకి సంబంధించిన పూర్తి స‌మాచారం మ‌రి కొద్ది రోజుల‌లో బ‌య‌ట‌కి రానుంది.

1715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles