అభిమానుల కాళ్ళ‌కి న‌మ‌స్క‌రించిన మెగా హీరో

Fri,February 2, 2018 09:48 AM
SAI DHARAM TEJ gives big shock to the fans

అభిమానులే త‌మ‌కి దేవుళ్ళ‌ని, వారి ప్రేమ‌, ఆద‌ర‌ణ వ‌ల‌నే ఈ రోజు ఇంత‌టి స్థాయిలో ఉన్నామ‌ని సినీ సెల‌బ్రిటీస్ ప‌లు వేడుక‌ల‌లో చెప్ప‌డం మ‌నం వింటూనే ఉంటాం. అయితే అభిమానుల‌ని దేవుళ్ళుగా ఆరాధించే మ‌న సెల‌బ్రిటీస్ ఈ మ‌ధ్య వాళ్ళ కాళ్ళ‌కి న‌మ‌స్కారం చేసి షాక్ ఇస్తున్నారు. ఆ మ‌ధ్య త‌మిళ స్టార్ హీరో సూర్య త‌న అభిమానుల పాదాల‌కి న‌మ‌స్క‌రించి అందరిని షాక్‌లో ప‌డేయ‌గా, రీసెంట్‌గా సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న ఫ్యాన్స్ పాదాల‌ని తాకి ఔరా అనిపించాడు. తేజూ న‌టిస్తున్న ఇంటిలిజెంట్ చిత్రంలో క‌ళా క‌ళామందిర్ అనే సాంగ్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా తేజూని చూసేందుకు అభిమానులు భారీగా వచ్చారు. కొంద‌రు ఆయ‌న‌కి పాదాభివంద‌నం చేసే క్ర‌మంలో సాయిధ‌ర‌మ్ తేజ్ తాను పాదాభివందనం పొందేటంతటి గొప్పవాడిని కాదని, ఇకపై అలా చేయవద్దని వారిస్తూ, అభిమానుల కాళ్లకు తాను ప్రతి నమస్కారం చేశాడు. దీంతో అక్క‌డి వారు ఖంగుతిన్నారు. అంతేకాదు తేజూ పాదాభివంద‌నం చేసిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార్చారు ఆయ‌న ఫ్యాన్స్. తేజూ న‌టించిన ఇంటిలిజెంట్ చిత్రం ఫిబ్రవ‌రి 9న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించారు.

2807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles