ఇక మీదట పేదోడికి ప్లాట్‌ఫాం ధర్మాబాయ్ డాట్‌కామ్.. అదరగొట్టిన ఇంటిలిజెంట్ టీజర్!

Sat,January 27, 2018 05:48 PM
Sai Dharam Tej Inttelligent Teaser

నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇంటిలిజెంట్ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదల అయింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఇంటిలిజెంట్ మూవీ తెరకెక్కగా సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల బాలయ్య ప్రధాన పాత్రలో విడుదలైన జై సింహా చిత్రానికి కూడా కళ్యాణ్ నిర్మాతగా ఉన్నారు.

ఈ కనెక్షన్ తోనే ఇంటిలిజెంట్ చిత్ర టీజర్ బాలయ్యతో విడుదల చేయించినట్లుగా తెలుస్తున్నది. ఇటీవల ఇంటిలిజెంట్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో సగం మొహాన్ని ఇంటిలిజెంట్ అనే అక్షరాలతో కవర్ చేసేసి.. కాస్త మ్యాట్రిక్స్ తరహా ఫీల్ తెచ్చేందుకు ప్రయత్నం చేశారు మేకర్స్ . ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిధరమ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ అటు సాయి ధరమ్ కి, ఇటు వినాయక్, లావణ్య త్రిపాఠిల కెరియర్ కి అవసరం కానుంది.

ఇక.. టీజర్ విషయానికి వస్తే ఆధ్యంతం ఫైట్లు, చేజింగ్ తో ఆకట్టుకున్న టీజర్.. స్టార్ట్ అవగానే ధర్మాన్ని ధర్మా భాయ్ ని అంటూ సాయ్ ధరమ్ తేజ్ రెట్టించిన స్వరంతో పలుకుతాడు. తర్వాత.. ఇక మీదట పేదోడికి ప్లాట్ ఫాం ధర్మాబాయ్ డాట్ కామ్ అంటూ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంటుంది ఆ సీన్. మొత్తం మీద వీవీ వినాయక్ మార్క్ ఈ టీజర్ లో కనిపిస్తున్నది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇంటిలిజెంట్ పై ఓ లుక్కేసుకోండి మరి..

2283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles