ఇద్ద‌రు భామ‌ల‌తో సంద‌డి చేయ‌నున్న సాయిధ‌ర‌మ్ తేజ్

Tue,February 12, 2019 09:34 AM
sai Dharam Tej Next Will Have Two heroines

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చిత్ర‌ల‌హ‌రి అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 12న విడుద‌ల కానున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తండ్రిగా పోసాని కృష్ణ‌ముర‌ళి న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. తండ్రి, కొడుకుల మ‌ధ్య ఉండే కొన్ని స‌న్నివేశాలు సినిమాకి చాలా హైలైట్‌గా ఉంటాయ‌ని చెబుతున్నారు. ఇక తేజూ స‌ర‌స‌న క‌థానాయిక‌లుగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పెతురాజ్‌ల‌ని ఎంపిక చేశార‌ట‌. హీరో, హీరోయిన్స్ మ‌ధ్య ఉండే రొమాంటిక్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ని అంటున్నారు. ఈ చిత్రం త‌ర్వాత‌ భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడు అశోక్‌తో క‌లిసి సాయి ధ‌ర‌మ్ సినిమా చేస్తాడ‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్‌. ఈ చిత్రంకి సంబంధించిన పూర్తి స‌మాచారం మ‌రి కొద్ది రోజుల‌లో బ‌య‌ట‌కి రానుంది.

1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles