విజ‌య్ సేతుప‌తితో సాయిధ‌ర‌మ్ తేజ్

Sun,March 17, 2019 12:58 PM
sai dharam tej pic with Vijay Sethupathi

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం చిత్ర‌ల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఒక‌వైపు త‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న తేజూ త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తిని సినిమా సెట్స్ లో క‌లిసారు. ఆయ‌న‌తో క‌లిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన సాయిధ‌ర‌మ్..‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న మాటకు బెస్ట్‌ ఉదాహరణ.. ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతిగారే.. మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సర్‌. ఆయన్ను నాకు పరిచయం చేసినందుకు థాంక్స్‌ రాశీ ఖన్నా..’ అని ట్వీట్‌ చేశారు. ప్ర‌స్తుతం రాశీఖ‌న్నా విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న ఓ త‌మిళ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది.అయితే రాశీ ఖ‌న్నా .. సాయిధ‌ర‌మ్ న‌టించిన‌ సుప్రీమ్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించింది. అప్ప‌టి నుండి వీరిద్దరి మ‌ధ్య స్నేహం నెల‌కొంది.

ఇదిలాఉంటే విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం ప‌లు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంటూనే చిరంజీవి న‌టిస్తున్న సైరా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మ‌రో వైపు సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఈ సంద‌ర్బంలోనే తేజూ.. విజ‌య్ సేతుప‌తిని క‌లిసాడా అనేది తెలియాల్సి ఉంది. వైష్ణ‌వ్ తేజ్ చిత్రం సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.2359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles