మెగా హీరోని డ్యూయ‌ల్ రోల్‌లో చూపించ‌నున్న వినాయ‌క్‌..!

Tue,September 5, 2017 11:11 AM
sai dharam tej plays dual role in vinayak movie

మెగాస్టార్ చిరంజీవి క‌మ్ బ్యాక్ చిత్రం ఖైదీ నెం 150తో బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు వివి వినాయ‌క్. ప్ర‌స్తుతం చిరు మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో ఓ మూవీ ప్లాన్ చేశాడు . ఈ మూవీ రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది . ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించ‌గా, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్క్రీన్ ప్లే అందించ‌నున్నారు. తేజూ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయికగా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. గ‌తంలో చిరంజీవి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ని డ్యూయ‌ల్ రోల్‌లో చూపించిన వినాయ‌క్ ఈ సారి తేజూని కూడా డ‌బుల్ రోల్‌లో చూపించాల‌ని భావిస్తున్నాడు. పక్కా మాస్ క‌థ‌తో తేజూ కెరియ‌ర్‌కి చాలా హెల్ప్ అయ్యేలా ఈ మూవీని తెర‌కెక్కించాల‌ని వినాయ‌క్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం జ‌వాన్ చిత్ర ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్న చైతూ త్వ‌ర‌లోనే వినాయ‌క్ టీంతో క‌ల‌వ‌నున్నాడు. తిక్క‌, విన్న‌ర్,న‌క్ష‌త్రం ఇలా వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్ కెరియ‌ర్‌కి ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైనర్ చాలా హెల్ప్ అవుతుంద‌ని స‌మాచారం. ఈ చిత్రం కోసం ‘ఇంటలిజెంట్’ అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు దుర్గ అనే టైటిల్‌ను కూడా చిత్రయూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

1445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles