ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ అచ్చూ.. కాపాడిన తేజూ

Thu,September 5, 2019 08:34 AM
Sai Dharam Tej saves music director

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రీల్‌గానే కాదు రియ‌ల్‌గాను హీరో అనిపించుకున్నాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ చూపించిన మానవత్వంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. వివ‌రాల‌లోకి వెళితే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అచ్చు రాజ‌మ‌ణి బుధ‌వారం సాయంత్రం జూబ్లీ హిల్స్‌ నుండి బైక్‌పై వెళుతున్నాడు. అయితే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 52లో కారును తప్పించబోయి టైర్‌ స్కిడ్‌ అయి కింద పడ్డాడు అచ్చూ. నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకొని అటుగా వ‌స్తున్న తేజూ ప్ర‌మాదాన్ని గుర్తించి, అచ్చుని తన కారులో ఎక్కించుకొని సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో అచ్చూ కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. పెద్ద ప్ర‌మాద‌మేమి లేద‌ని వైద్యులు చెప్ప‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

2601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles