సింగిల్‌గా ఉన్న‌వారికి సాయిధ‌ర‌మ్ వినూత్న ఛాలెంజ్‌

Fri,February 8, 2019 08:48 AM
sai dharam tej valentine challenge to netigens

సోష‌ల్ మీడియాకి ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ప్ప‌టి నుండి స‌రికొత్త ఛాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ ఛాలెంజ్‌ల‌లో సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా భాగం అవుతున్నారు. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేమికుల రోజు రానుండ‌డంతో మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న అభిమానుల‌కి వినూత్న ఛాలెంజ్ విసిరారు. త‌న ట్విట్ట‌ర్‌లో ‘మీరూ నాలా సింగిల్‌గా ఉన్నారా.. అయితే రండి సింగిల్స్ వాలంటైన్ వీక్‌ను జరుపుకుందాం’ అంటూ పిలుపునిచ్చారు. #SDTsingleChallenge ఉపయోగించి మీ గొప్ప సింగిల్ స్టోరీలను షేర్ చేయండి .. ప్రతి సింగిల్‌కి ఒక కథ ఉంటుంది’ అంటూ
‘1999 - సింగిలే..
2009 - ఎహే సింగిలే..
2019 - అయినా కానీ సింగిలే.. సింగిలే..' అనే కామెంట్ పెట్టాడు. దీనికి క‌మెడీయ‌న్ వెన్నెల కిషోర్ ఫ‌న్నీగా స‌మాధాన‌మిచ్చాడు. మెట్రో రైలులో ఆయన పడుకొని ఉన్న ఫొటోను పెట్టి.. ‘ప్రేమ ప్రయాణంలో మీ పరిస్థితి ఇది అంటారు అయితే’ అని కామెంట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన తేజూ.. మీనుండి నేర్చుకున్న‌దే అన్న‌గారు అని కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్స్ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. సాయిధ‌ర‌మ్ ప్ర‌స్తుతం చిత్రల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.2580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles