సైరాలో సాయి పల్లవి తండ్రి

Sun,July 22, 2018 06:40 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహరెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. మూవీ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతున్నది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఫిదా మూవీలో సాయి పల్లవికి తండ్రిగా నటించిన సాయిచంద్ సైరాలో నటించనున్నాడట. సాయిచంద్ సెలెక్టెడ్ రోల్స్‌లోనే ఎక్కువగా నటిస్తుంటాడు. అయితే.. సైరాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మూవీ టీమ్ సాయిచంద్‌ను సంప్రదించిందట. ముఖ్యమైన పాత్ర కావడంతో సాయిచంద్ కూడా ఓకే అన్నట్లు సమాచారం.

సాయిచంద్ 80వ దశకంలో వచ్చిన మాభూమి, రంగులకల, మంచు పల్లకి, ఆడవాళ్లే అలిగితే, శివ, అంకురం లాంటి సినిమాల్లో నటించాడు. మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి బయోపికే ఈ సైరా మూవీ. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే నరసింహరెడ్డి బ్రిటీష్ పాలకులకు ఎదురుతిరిగాడు. అందుకే నరసింహరెడ్డి మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రకెక్కాడు. రూ.200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నయనతార, కన్నడ హీరో సుదీప్, తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నారు.

8525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles