శర్వానంద్ తో గొడవ విషయంపై స్పందించిన సాయి పల్లవి

Sat,August 4, 2018 09:42 AM
sai pallavi gives clarity on sharwanand issue

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మలయాళ భామ సాయి పల్లవి. యంగ్ హీరోలు నాగ శౌర్య, నానిలతో నటించిన ఈ భామ ప్రస్తుతం శర్వానంద్ సరసన పడి పడి లేచే మనసు అనే సినిమా చేస్తుంది. టాలెంట్ పరంగా సాయి పల్లవికి వంక పెట్టే పరిస్థితి లేదు. కాని తన ప్రవర్తన వలన హీరోలు కూడా ఇబ్బంది పడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. కణం చిత్ర షూటింగ్ సమయంలో సాయి పల్లవి .. నాగ శౌర్యతో గొడవపడిందని వార్తలు వచ్చాయి. ఎంసీఏ చిత్రీకరణ సమయంలో నానితో సాయి పల్లవికి గొడవ అయిందని అన్నారు. ఇక రీసెంట్ గా పడిపడిలేచే మనసు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ మలయాళీ భామ శర్వానంద్ తో గొడవ పడడం వలన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం లేదంటూ పుకార్లు వినిపించాయి. దీనిపై తాజాగా వివరణ ఇచ్చింది సాయి పల్లవి.

శర్వానంద్ ప్రస్తుతం పడి పడి లేచే మనసు సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కొన్నాళ్లు నేను నటిస్తున్న సినిమాకి బ్రేక్ ఇచ్చాడు. అంతే తప్ప మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా షూటింగ్ ఆగిపోయిందని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ రూమర్స్ ని కొట్టి పారేసింది ఈ ఫిదా భామ.

3463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles