‘ఇంటలిజెంట్’ గా టాలీవుడ్ హీరో..!

Tue,August 8, 2017 10:09 PM
saidharam tej next movie titled as intelligent..!


హైదరాబాద్: ఇటీవలే నక్షత్రం మూవీలో స్పెషల్ రోల్‌తో ఆడియెన్స్‌ను పలకరించాడు టాలీవుడ్ యాక్టర్ సాయిధరమ్ తేజ్. ఈ యువనటుడు తన నెక్ట్స్ మూవీని వివి వినాయక్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. సాయి-వినయ్‌ల మూవీకి క్రేజీ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ‘ఇంటలిజెంట్’ అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు దుర్గ అనే టైటిల్‌ను కూడా చిత్రయూనిట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. హీరోయిన్, ఇతర టెక్నికల్ టీం వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

2302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles