సల్మాన్ ఖాన్ ‘భారత్’ ట్రైలర్..

Mon,April 22, 2019 04:58 PM
Salman Khan BHARAT Official Trailer is out


ముంబై: సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్, దిశా పటానీ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘భారత్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సల్మాన్ ఖాన్.. యువకుడిగా సర్కస్‌లో బైకుపై విన్యాసాలు చేసే సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సల్మాన్ నేవీ అధికారిగా..60 సంవత్సరాల వృద్ధుడిగా విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న భారత్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ..సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, జాకీష్రాప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఘనవిజయం సాధించిన ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి రీమేక్‌గా భారత్ తెరకెక్కుతోంది. ఈద్ కానుకగా ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

1651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles