పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న స‌ల్మాన్ ప్రేయ‌సి

Thu,July 18, 2019 09:54 AM
Salman Khan girlfriend Iulia Vantur says she got a shaky alarm

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కొద్ది రోజుల క్రితం రొమానియ‌న్ బ్యూటీ ఉలియా వంతూర్‌తో చెట్టాప‌ట్టాలు వేసుకొని తిరిగిన సంగ‌తి తెలిసిందే. అనేక కార్య‌క్ర‌మాల‌లో ఆమె స‌ల్మాన్‌తో క‌లిసి తిరుగుతూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఉలియా ఈ మ‌ధ్య వార్త‌ల‌లో అంత‌గా లేదు. తాజాగా ఆమె పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న‌ట్టు ఓ వీడియో ద్వారా తెలుపుతూ వార్త‌ల‌లోకి ఎక్కింది. వ‌ర్క్ కోసం ఇండొనేసియా వెళ్లిన ఉలియా.. బాలిలోని ఓ హోటల్‌లో దిగింది. అక్క‌డ 5.7 తీవ్రతతో భూమి కంపించింది. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వివ‌రించింది.

జీవితానికి మేలుకొలుపు. ఉద‌యం భ‌యంక‌ర‌మైన అలారంతో నిద్ర లేచాను. నేను్న‌న ప్ర‌దేశంలో భూమి 5.7 తీవ్ర‌త‌తో కంపించింది. కొద్ది క్ష‌ణాల పాటు నా మైండ్‌లో వేల ఆలోచ‌న‌లు తిరిగియి. దేవుడిని న‌మ్ముకొని కామ్‌గా ఉన్నాను. ఎలాంటి చెడు జ‌ర‌గ‌ద‌ని నా మ‌న‌సుకి అనిపిస్తూనే ఉంది. అనుకున్న‌ట్టుగానే ఎవ‌రికి ఏం జ‌ర‌గ‌లేదు. కొద్ది క్ష‌ణాల‌లో అంతా నార్మ‌ల్‌గా ఉంది. ఇక ఆ త‌ర్వాత షూటింగ్‌కి ఏమి కాన‌ట్టే వెళ్ళాను. నేను ఇంకా బ‌తికే ఉన్నాన‌ని మ‌న‌సులో అనుకుంటూ ఉన్నాను. ఏదేమైన మ‌ళ్ళీ నేను పుట్టినట్టుగా ఉంది. అందుకే బాలీ ప్ర‌దేశంలో ఫోటో షూట్ చేశాను . ఈ ప్ర‌దేశం చాలా అందంగా ఉంద‌ని ఉలియా పేర్కొంది. ఉలియా నటించిన ‘రాధా క్యూ గోరీ మై క్యూ కాలా’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

Wake up to life!!! Today I’ve got a v shaky “alarm” in the morning. Bali, the place where I am right now, got affected by a 5.7 magnitude earthquake. In only few seconds thousands of thoughts were “shaking” my mind but I decided to stay calm and have faith. I felt v clearly that nothing bad is gonna happen and it will pass the way it came. Thank God no one got injured this time, all went back to normal in few minutes. Sometimes we need a reminder! Life can be only this much!!! So... enjoy it and make the most of it. Today! I went on with my schedule, like “nothing” happened but deep inside I felt that I’m more alive today. Today, I ve done a nice photoshooting and I’ve discovered a bit more of beautiful #bali #iuliavantur #kantolampowaterfall @bali_whereisnikita

A post shared by Iulia Vantur (@vanturiulia) on

1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles