చంపేస్తామంటూ స‌ల్మాన్‌కి బెదిరింపులు

Wed,September 25, 2019 10:36 AM

బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్‌కి బెదిరింపులు ఏమి కొత్త కాదు. గ‌తంలోను ఆయ‌న‌ని చంపేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. దీనిపై స‌ల్మాన్ పోలీసులని ఆశ్ర‌యించ‌గా,కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు నిందితులని ప‌ట్టుకున్నారు. తాజాగా ఫేస్ బుక్‌లో గ్యారీ షూట‌ర్ పేరిట స‌ల్మాన్ ఖాన్‌ని చంపేస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. స‌ల్మాన్ భారతీయ చ‌ట్టం నుండి త‌ప్పించుకోల‌గ‌డు కాని బిష్ణోయ్ సంఘం నుండి కాద‌ని వారు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్‌కి భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేస్తున్న‌ట్టు రాజ‌స్థాన్ పోలీసులు తెలిపారు.


1998వ సంవత్సరంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ తన తోటి నటులు సైఫ్ ఆలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ లతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. జోథ్‌పూర్ కోర్టు దర్యాప్తు చేస్తున్న నేప‌థ్యంలో ఈ నెల 27వతేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు స‌ల్మాన్ ఖాన్. విచార‌ణ‌కి వ‌చ్చే రోజు ఆయ‌న‌ని హ‌త‌మారుస్తామ‌ని మెసేజ్‌లు రావ‌డం సంచ‌ల‌నం రేపుతుంది. స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం దబాంగ్ 3 చిత్రంతో పాటు ఇన్షా అల్లా అనే సినిమా చేస్తున్నాడు.


2573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles