గ‌డ్డం పెంచిన స‌ల్మాన్‌.. భార‌త్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Mon,April 15, 2019 05:03 PM
Salman Khan releases Bharat first look poster

హైద‌రాబాద్: స‌ల్మాన్ కండ‌ల‌వీరుడ‌ని తెలుసు. మ‌రి ఆ వీరుడు ముస‌లిత‌నంలో ఎలా ఉంటాడో తెలుసా. అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్న భార‌త్ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ .. భార‌త్ ఫిల్మ్ పోస్ట‌ర్‌లో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. త‌ల‌వెంట్రుక‌లు తెల్ల‌బ‌డి, గ‌డ్డం కూడా తెల్ల‌బ‌డిన గెట‌ప్‌తో స‌ల్మాన్‌.. భార‌త్ పోస్ట‌ర్‌లో ఇంట్రెస్టింగ్‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. తల‌లో, గ‌డ్డంలో ఉన్న తెల్ల వెంట్రుక‌ల క‌న్నా.. త‌న జీవితంలో ఎన్నో రంగులు ఉన్నాయ‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో భార‌త్ పోస్ట‌ర్‌ను షేర్ చేసి దానికి ట్యాగ్‌లైన్ పెట్టాడు స‌ల్మాన్ .


ఎప్పుడూ బాడీబిల్డ‌ర్‌లా క‌నిపించే స‌ల్మాన్‌.. ఈ సినిమాలో మాత్రం వెరైటీ లుక్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. దేశ విభ‌జ‌న కాలం నాటి క‌థ‌తో స‌ల్మాన్‌.. భార‌త్ ఫిల్మ్‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా క‌త్రినా కైఫ్‌, దిశా ప‌ఠానీ న‌టిస్తున్నారు. సల్మాన్‌ 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో ఈ మూవీలో కనిపిస్తారట. ఈద్ కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. కొరియ‌న్ చిత్రం రీమేక్‌గా తెర‌కెక్కుతున్న భార‌త్ చిత్ర షూటింగ్ పూర్తైంద‌ని క‌త్రినా కైఫ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇటీవ‌ల వెల్ల‌డించింది. ఈ చిత్రంలో ట‌బు, జాకీ ష్రాఫ్‌, నోరా ఫ‌తేహి, సునీల్ గ్రోవ‌ర్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. స‌ల్మాన్ తండ్రిగా జాకీ ష్రాఫ్ న‌టిస్తున్నాడు. జూన్ 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మ‌రికొన్ని రోజుల్లో ట్రైల‌ర్ విడుద‌ల కానున్న‌ది.

1757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles