వ్యక్తి నుంచి ఫోన్ లాక్కున్న సల్మాన్‌ఖాన్

Thu,April 25, 2019 06:43 PM
Salman Khan snatches a man phone in mumbai


బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై ముంబై డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సల్మాన్‌ఖాన్ తన ఫోన్ దొంగిలించాడని ఓ వ్యక్తి పీఎస్‌లో పిర్యాదు చేశాడు. సల్మాన్‌ఖాన్ ముంబై అంధేరీ వెస్ట్ లోని లింక్ రోడ్ మీదుగా సైక్లింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇంతలో సల్మాన్‌ను చూసిన సదరు వ్యక్తి..సల్మాన్‌ను ఫాలో అవుతూ సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. ఇది గమనించిన సల్మాన్ ఆ వ్యక్తిని హెచ్చరించి..అతని సెల్‌ఫోన్ లాక్కున్నాడు. సల్మాన్, అతని బాడీగార్డ్స్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి..సెల్‌ఫోన్ లాక్కున్నారని సదరు వ్యక్తి పోలీసులకు పిర్యాదు చేశాడు. సల్మాన్ ఖాన్ అనుమతి తీసుకోకుండా ఆయన్ను ఫాలో అవుతూ వీడియో తీశాడని సల్లూభాయ్ బాడీగార్డ్స్ కూడా ఆ వ్యక్తిపై పిర్యాదు చేశారు.

1965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles