గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో స్టెప్పులేసిన స‌ల్మాన్, స్వ‌ర భాస్క‌ర్

Wed,September 4, 2019 11:10 AM
Salman Khan, Swara Bhasker, Daisy Shah dance at Arpita Khans Ganesh visarjan

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ సోద‌రి అర్పితా ఖాన్ ప్ర‌తి ఏడాది త‌మ ఇంట్లో వినాయ‌కుడిని నెల‌కొల్పి ఎంతో ఘ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ ఏడాది కూడా గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని నెల‌కొల్ప‌గా, మంగ‌ళ‌వారం నిమ‌జ్జ‌నం చేశారు. నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన స‌ల్మాన్ ఖాన్, స్వ‌ర భాస్క‌ర్, డైసీ షా తీన్మార్ స్టెప్పులు వేశారు. బీట్స్‌కి త‌గ్గ‌ట్టుగా స‌ల్మాన్ వేసిన స్టెప్పులు అక్క‌డిని వారిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. స‌ల్మాన్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. అలానే స‌ల్మాన్ త‌న మేన‌ల్లుడు అహిల్‌ని ఎత్తుకొని వినాయ‌కుడికి హార‌తి ఇస్తున్న వీడియోతో పాటు త‌న త‌ల్లి స‌ల్మా ప‌క్క‌న కూర్చొని భ‌జ‌న చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స‌ల్మాన్ వ‌ర్క్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న న‌టించిన ద‌బాంగ్ 3 చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇన్షా అల్లా అనే చిత్రంలోను స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు.


2423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles