మికాతో జ‌త‌క‌ట్టిన స‌ల్మాన్.. బ్యాన్ త‌ప్పదంటూ హెచ్చ‌రికలు

Tue,August 20, 2019 12:25 PM
Salman Khan Will Be Banned, if he works with mika

ప్ర‌ముఖ గాయ‌కుడు మికా సింగ్ పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు చెందిన సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి త‌న టీంతో వెళ్ళి అక్క‌డ ప్ర‌ద‌ర్శన జరిపిన‌ సంగ‌తి తెలిసిందే. భార‌త్‌- పాక్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో అక్క‌డి ఎలా వెళ్ళావు అని ఆయ‌న‌ని ప్ర‌శ్నించాయి ఇండియ‌న్ సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్‌( ఎసీసీడ‌బ్ల్యూఏ), ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) సంఘాలు. అంతేకాదు అత‌నిపై నిషేదం కూడా విధించాయి.

ఇక్క‌డ ఆస‌క్తిర విష‌యం ఏంటంటే యూస్‌లోని ఆరు ప‌ట్ట‌ణాల‌లో జ‌ర‌గ‌నున్న క‌న్స‌ర్ట్స్ కోసం స‌ల్మాన్ ఖాన్‌.. మికా సింగ్‌తో జ‌త‌క‌ట్టాడు. ఈ నేప‌థ్యంలో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అశోక్ దుబే స‌ల్మాన్‌కి హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. మేము నిషేధం విధించినట్లయితే, మా సాంకేతిక నిపుణులందరూ - నటులు, దర్శకులు మరియు స్పాట్ అబ్బాయిలతో సహా ఎవ‌రు మికాతో కలిసి పనిచేయరు. ఈ నిషేధ సమయంలో ఎవరైనా మికాతో కలిసి పనిచేస్తే, సల్మాన్ లేదా మరెవరైనా స‌రే అత‌డు కూడా నిషేధించబడతారు అని స్ప‌ష్టం చేశారు. ఈ రోజు మికా ఎసీసీడ‌బ్ల్యూఏ మెంబ‌ర్స్ ని క‌లిసి త‌న‌పై విధించిన నేషేదాన్ని తొలగించేలా చ‌ర్చలు జ‌ర‌పనున్నార‌ట‌. మ‌రి క‌మిటీ తుది నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి.

1792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles