శివ‌సేనలో చేరిన స‌ల్మాన్‌ఖాన్ బాడీగార్డ్‌

Sat,October 19, 2019 08:48 AM

హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. ఈనెల 21న ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా ప‌నిచేస్తున్న‌ షేరా శుక్ర‌వారం రోజున శివ‌సేన పార్టీలో చేరారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా శివ‌సేన ఈ ప్ర‌క‌ట‌న చేసింది. స‌ల్మాన్ బాడీగార్డ్ షేరా అస‌లు పేరు గుర్మీత్ సింగ్‌. శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ థాక‌రే, యువ సేనా అధ్య‌క్షుడు ఆదిత్య థాక‌రే.. గుర్మీత్‌కు ఆహ్వానం ప‌లికారు. ముంబైలోని మాతోశ్రీ నివాసంలో ఈ చేరిక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఎన్నో ఏళ్ల నుంచి స‌ల్మాన్ ఖాన్‌కు షేరా బాడీగార్డ్ చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోకు అత‌నెంతో న‌మ్మ‌క‌స్తుడు. సూప‌ర్‌స్టార్ ఇంట్లో జ‌రిగే ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ అత‌ను క‌నిపిస్తాడు. మ‌హా ఎన్నిక‌ల్లో శివ‌సేన.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఆదిత్య థాక‌రే వొర్లీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీలో ఉన్నారు.



2089
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles