లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజే సల్మాన్ పెళ్లి వార్త..?

Wed,May 22, 2019 06:57 PM
salman should announce his wedding on May 23 ?


సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్‌ఖాన్. తమ అభిమాన నటుడు సల్మాన్ ఇక పెళ్లి చేసుకోరేమోనని కొందరు ఫ్యాన్స్ అనుకుంటుండగా..మిగతా అభిమానులు మాత్రం సల్లూభాయ్ ఎప్పుడు పెళ్లి వార్త చెప్తాడా అని ఎదురుచూస్తున్నారు. సల్మాన్‌ఖాన్ మాత్రం పెళ్లికి సంబంధించిన విషయంపై ఎపుడూ స్పష్టత ఇవ్వలేదు. అసలు సల్మాన్ పెళ్లి చేసుకుంటాడా? లేదా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉండిపోయింది.

తాజాగా పెళ్లి అంశంపై ఆసక్తికర సమాధానమిచ్చాడు సల్లూభాయ్. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు మే 23న పెళ్లి వార్త చెప్తానంటూనే ఓ నవ్వు నవ్వాడు సల్మాన్. ప్రధాని పీఠంపై ఎవరు కూర్చుంటారనేది నిర్ణయించే ఎన్నికల ఫలితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారా..? లేదా తన పెళ్లి విషయంపై శ్రద్ధ కనబరుస్తారో తెలుసుకునేందుకే ఇలాంటి కామెంట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి సల్మాన్‌ఖాన్ పెళ్లి కామెంట్స్ ఫన్నీగా చేశాడా..? లేదా నిజంగానే రేపు పెళ్లి గురించి చెప్తాడా..? అని మాట్లాడుకుంటున్నారు అభిమానులు. మరి లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు సల్మాన్ ఏమైనా స్పందిస్తాడో చూడాలి.

4779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles