హాట్ టాపిక్‌గా మారిన స‌మంత డ్రెస్ ఖ‌రీదు..!

Sat,August 31, 2019 10:30 AM

తెలుగు సినిమాకి ఫ్యాష‌న్ ఐకాన్‌గా మారింది అక్కినేని కోడ‌లు స‌మంత‌. కొత్త లుక్ ట్రై చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉండే స‌మంత మిగ‌తా హీరోయిన్స్ క‌న్నా కాస్త ఎక్కువ‌ గ్లామ‌ర్‌గా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటుంది. తాజాగా త‌న మామ బ‌ర్త్‌డే వేడుక‌లో వ‌న్ షోల్డ‌ర్ షిమ్మ‌ర్ డ్రెస్‌తో క‌నిపించిన సామ్ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి ఫోటోలు దిగిన సామ్ నెటిజ‌న్స్ మ‌తులు పోగొట్టింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ డ్రెస్ సుమారు 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్ బేబీస్ డ్రెస్‌ల ధ‌ర గురించి చ‌ర్చించిన మ‌నం ఇప్పుడు సౌత్ హీరోయిన్ స‌మంత డ్రెస్ రేటు గురించి మాట్లాడుకోవ‌డం గ‌మ‌న‌ర్హం. స్పెయిన్‌లో నాగ్ 60వ బ‌ర్త్‌డే వేడుకలు జ‌ర‌గ‌గా ఈ వేడుక‌లో స‌మంత‌, చైతూ, అఖిల్‌, అమ‌ల కూడా పాల్గొన్నారు. వీరి ఫోటోలు సోష‌ల్ మీడియాలో కొద్ది రోజులుగా వైర‌ల్ అవుతున్నాయి. కాగా, స‌మంత ప్ర‌స్తుతం త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం 96 రీమేక్‌తో బిజీగా ఉంది.

6301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles