స‌మంత‌పై కంగ‌నా సోద‌రి ప్ర‌శంస‌

Sat,July 6, 2019 08:19 AM

రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, యూ ట‌ర్న్‌, సూప‌ర్ డీల‌క్స్, మ‌జిలీ, ఓ బేబీ ఇలా వ‌రుస విజ‌యాలు సాధించ‌డ‌మే కాక విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న న‌టి స‌మంత‌. అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ పొందిన త‌ర్వాత స‌మంత ఫేట్ పూర్తిగా మారింది. ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. తాజాగా విడుద‌లైన ఓ బేబి చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రు బాగా ఆద‌రిస్తున్నారు. రివ్యూయ‌ర్స్ కూడా చిత్రానికి మంచి రేటింగ్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ వెబ్‌సైట్ ఓ బేబి చిత్రానికి సంబంధించిన క‌థ‌నం రాసి రేటింగ్ ఇచ్చింది. దీన్ని షేర్ చేసిన కంగాన సోద‌రి రంగోలి.. ఓ బేబి చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. స‌మంత అస‌లు సిస‌లైన స్త్రీ వాది. ఆమె జీవితం విజ‌య‌వంత‌మైన క‌థ‌. పెద్ద కుటుంబానికి చెందిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికి త‌న‌కంటూ సొంత ఇమేజ్ ఏర్ప‌ర‌చుకుంది. స‌మంత వంటి దేవ‌త‌ల‌ని తాము ఎల్ల‌పప్పుడు ప్ర‌శంసిస్తాము. కంనా టీం నుండి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు అని రంగోలి పేర్కొంది. ఈ ట్వీట్‌కి స‌మంత రిప్లై ఇచ్చింది. నాపై ఎంతో ప్రేమ కురిపించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ బ‌దులిచ్చింది.1753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles