అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న స‌మంత క‌టౌట్‌

Thu,July 4, 2019 08:22 AM

వ‌రుస విజ‌యాల‌తో స్టార్ హీరోల స్టాట‌స్ అందుకున్న ముద్దుగుమ్మ స‌మంత‌. అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న త‌ర్వాత స‌మంత ఖాతాలో వ‌రుస విజ‌యాలు వ‌చ్చి చేరాయి. ప్ర‌స్తుతం ఆమె క్రేజ్ స్టార్ హీరోల‌కి స‌మానంగా ఉంది. కొద్ది రోజుల క్రితం మ‌జిలీ చిత్రంలో చైతూతో క‌లిసి సంద‌డి చేసిన సామ్ రేపు ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్స్, ట్రైల‌ర్ సినిమాపై భారీ ఆస‌క్తిని పెంచాయి. చిత్ర యూనిట్ కూడా సినిమాకి కావ‌ల‌సినంత ప్ర‌మోష‌న్ కూడా చేసింది. అయితే ఓ బేబి చిత్రం రేపు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో స‌మంత ఫ్యాన్స్ ఆమెకి భారీ క‌టౌట్ ఏర్పాటు చేశారు.


అగ్ర‌హీరోల‌కి మాత్ర‌మే ఏర్పాటు చేసే ఈ రేంజ్ క‌టౌట్ ఇప్పుడు స‌మంత‌కి కూడా ఏర్పాటు చేయ‌డం విశేషం. ఈ క‌టౌట్ అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. స‌మంత కూడా త‌న కటౌట్ ఏర్పాటు చేయ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ ఓ బేబి చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఓ బేబి చిత్రంలో స‌మంత వృద్ధురాల‌య్యాక ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపిస్తారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు.

2753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles